బన్నీ సినిమా దేవరకొండ చేతికి?

టాలీవుడ్ లో మరో క్రేజీ గాసిప్ ఊపందుకుంది. అల్లు అర్జున్ చేయాల్సిన ఓ సినిమా విజయ్ దేవరకొండ చేతికి వెళ్లిందట. అది కూడా అల్లాటప్పా సినిమా కాదు. ఏకంగా కొరటాల శివ దర్శకత్వంలో రావాల్సిన సినిమా. ఇంతకీ మేటర్ ఏంటో చూద్దాం.

ఆచార్య సినిమా ఆలస్యంతో చాలా అసహనంతో ఉన్నాడు కొరటాల. ఇకపై తనకు వెంటనే కాల్షీట్లు ఇచ్చే
హీరోలతోనే సినిమాలు చేస్తానని బహిరంగంగా ప్రకటించాడు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే బన్నీతో సినిమా ప్రకటించాడు కొరటాల. దీనికి సంబంధించి ప్రీ-లుక్ పోస్టర్ కూడా వచ్చేసింది.

ఇప్పుడీ సినిమాకు సంబంధించి బన్నీ మరింత ఆలస్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. పుష్ప సినిమా ఊహించని విధంగా 2 భాగాలుగా మారడంతో, కొరటాలకు మరోసారి వెయిటింగ్ తప్పేలా లేదు. దీంతో కొరటాల, బన్నీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. బన్నీకి చెప్పిన కథను విజయ్ దేవరకొండకు వినిపించాడట. నేరుగా విజయ్ తో సెట్స్ పైకి వెళ్లిపోతాడట.

కొరటాల కోసం విజయ్ తన పాత కమిట్ మెంట్స్ కూడా పక్కనపెట్టి మరీ కాల్షీట్లు కేటాయించాడట. ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ హాట్ గా నడుస్తున్న పుకారు ఇది. ఇందులో నిజమెంతో కాలమే నిర్ణయించాలి.