సూపర్ అండ్ సింప్లీ బ్రేక్ ఫాస్ట్

రోజువారీ ఆహారంలో పొద్దున్నే తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ఎంతో కీలకమైంది. అందుకే పొద్దునే తీసుకునే ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్లు మంచి హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ను ప్లాన్ చేసుకోవాలి. అయితే బిజీబిజీగా ఉండే ఇప్పటి లైఫ్ స్టైల్ లో వెంటనే రెడీ చేసుకునే బెస్ట్ హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ఒకటుంది. అదే ముయెస్లీ. మంచి పోషకవిలువలతో పాటు, బరువు తగ్గేందుకు తోడ్పడే ఈ ఫుడ్

స్పెషాలిటీ ఏంటంటే..
ముయెస్లీ అనేది రెడీ టు ఈట్ ఫుడ్. దీన్ని తృణధాన్యాలు, ఓట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ తో తయారు చేస్తారు. ఇది బెస్ట్ అండ్ సింపుల్ బ్రేక్ ఫాస్ట్ కు మంచి ఆప్షన్.
ముయెస్లీ అనేది హై ప్రోటీన్ ఫుడ్. దీన్ని ఓట్స్, మొక్కజొన్న, గోధుమ, ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ , నట్స్ తో తయారు చేస్తారు. విటమిన్ E, థయమిన్, విటమిన్ B6, విటమిన్ B 12 తో పాటు ఐరన్ మెగ్నీషియం, పాస్ఫరస్, పొటాషియం, జింక్ అన్ని ఖనిజాలు లభిస్తాయి.
ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ పొట్టను లైట్ గానే ఉంచుతూ ఆకలి లేకుండా చేస్తుంది.

లాభాలివే..
ముయెస్లీ ఇతర మిల్లెట్ ఫుడ్స్ కంటే బెస్ట్ ఆప్షన్ గా పనిచేస్తుంది. ఖాళీ సమయాల్లో తినే చిరుతిండి కింద కూడా దీన్ని తీసుకోవచ్చు. శాండ్‌విచ్‌లు లేదా డోనట్‌లతో పోలిస్తే తక్కువ షుగర్, తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది.

ముయెస్లీలో ఉండే ఫైబర్, నట్స్ జీర్ణవ్యవస్థను నియంత్రించడంలో సహాయపడతాయి.
ముయెస్లీలో ఉండే పదార్థాలన్ని గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ప్రోటీన్, ఒమేగా యాసిడ్స్, విటమిన్లు, పొటాషియంల కోసం మిల్లెట్లతో కూడిన ముయెస్లీ బెస్ట్ ఆప్షన్.