పుష్ప పార్ట్-1 వచ్చేది అప్పుడే!

అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో మూడో సినిమాగా వస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘పుష్ప’. ఈ
సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా మరో అప్ డేట్ బయటికొచ్చింది. సినిమాను రెండు భాగాలుగా రిలీజ్
చేయబోతున్నరనేది ఆ అప్ డేట్. అయితే ముందుగా మొదటి భాగాన్ని ఆగస్ట్ లో విడుదల
చేయాలనుకున్నారు. కానీ కరోన సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటం, బన్నీ కి కోవిడ్ పాజిటివ్ రావడం
కారణంగా షూటింగ్ వాయిదా పడటంతో రిలీజ్ కూడా వాయిదా పడింది. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు
కానీ ఆగస్ట్ లో సినిమా రిలీజ్ అయ్యే అవకాశమే లేదు.

సినిమాకు సంబంధించి ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అలాగే సాంగ్స్ కూడా షూట్ చేయాల్సి ఉందని
తెలుస్తుంది. సో.. షూటింగ్ మొదలు కావడానికి ఇంకా 2-3 నెలలు పట్టొచ్చు. అందుకే మరో డేట్ లాక్
చేసుకున్నారు మేకర్స్. అక్టోబర్ 13 న దసరా కానుకగా సినిమాను థియేటర్స్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో
ఉన్నారట. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించి ప్రేక్షకులకు క్లారిటీ ఇవ్వబోతున్నారట.

నిజానికి ఈ తేదీ ఆర్ఆర్ఆర్ సినిమాది. అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ ను రిలీజ్ చేస్తామని గతంలో రాజమౌళి
ప్రకటించాడు. కానీ ఇప్పుడా తేదీకి ఆర్ఆర్ఆర్ రావట్లేదు. ఎప్పుడొస్తుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే ఆ
తేదీపై ముందే కర్చీఫ్ వేశాడు బన్నీ. పుష్ప పార్ట్-1ను రిలీజ్ చేయాలనుకుంటున్నాడు.