హీరోయిన్ పూజా హెగ్డేకు కరోనా

టాలీవుడ్ లో మరో హీరోయిన్ కరోనా బారిన పడింది. ఇప్పటికే తమన్న, రకుల్ ప్రీత్ లాంటి హీరోయిన్లు ఈ వైరస్ బారిన పడగా.. తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే కు కూడా కరోనా వచ్చింది. తనకు కరోనా సోకిన విషయాన్ని పూజా హెగ్డే స్వయంగా ప్రకటించింది. రీసెంట్ గా తనను కలిసిన వాళ్లంతా విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరింది.

పూజా హెగ్డేకు కరోనా సోకడంతో ఆమె నటిస్తున్న సినిమాలేవీ ఇబ్బందుల్లో పడలేదు. ఎందుకంటే, ఇప్పటికే టాలీవుడ్ లో షూటింగ్స్ నిలిచిపోయాయి. రాధేశ్యామ్, ఆచార్య సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి. అటు విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సినిమా కూడా ఆగిపోయింది. కాబట్టి పూజా హెగ్డే కరోనా ఎఫెక్ట్, ఆమె సినిమాలపై పడలేదు.

గతేడాది కరోనా ప్రారంభమైన కొత్తలో పూజా హెగ్డే చాలా జాగ్రత్తగా ఉంది. కరోనా పీక్ స్టేజ్ కు వచ్చే టైమ్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూటింగ్ పూర్తిచేసింది. అప్పటికే అల వైకుంఠపురములో సక్సెస్ తో పీక్ స్టేజ్ లో ఉన్న ఈ బ్యూటీ.. ఆచార్య, విజయ్ సినిమా లాంటి భారీ ప్రాజెక్టులు అంగీకరించింది. అంతలోనే కరోనా బారిన పడింది.