నయనతారతో క్లాసిక్ రీమేక్

కొన్ని సినిమాలు రీమేక్ చేయాలంటే స్టార్స్ కావాల్సిందే. లేకపోతే ఆ రీమేక్ కు వెయిట్ ఉండదు.
మాతృదేవోభవ రీమేక్ కూడా అలాంటిదే. అప్పట్లో ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.
ఏడిపించి వదిలేసింది. థియేటర్లకు వచ్చే ఆడియన్స్ కు టిక్కెట్ తో పాటు కళ్లు తుడుచుకోవడానికి కర్చీఫ్
లు ఇచ్చారంటే ఆ సినిమా ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు

మరి అలాంటి సినిమాను ఇప్పుడు రీమేక్ చేయాల్సి వస్తే, ఏ హీరోయిన్ అయితే బాగుంటుంది. ఈ
జనరేషన్ కు మాతృదేవోభన రీమేక్ ను అందించాలంటే నయనతార లాంటి స్టార్ అయితేనే కరెక్ట్
అంటున్నాడు నిర్మాత కేఎస్ రామారావు. అనుష్క, కీర్తిసురేష్ కూడా సరిపోతారని.. కానీ తనకు మాత్రం
నయన్ అయితేనే బెస్ట్ అంటున్నాడు.

ఇక్కడే ఓ ఇష్యూ కూడా లేవదీశాడు ఈ సీనియర్ ప్రొడ్యూసర్. అప్పట్లో మాతృదేవోభవ సినిమాను తక్కువ
బడ్జెట్ లో తీశామని, ఇప్పుడు ఆ రీమేక్ ను తీయాలంటే రెమ్యూరనేషన్ కే కోట్ల రూపాయలు
సమర్పించుకోవాలని అన్నాడు. ప్రస్తుతం నటీనటుల రెమ్యూనరేషన్స్ చూస్తుంటే కంగారేస్తోందన్నాడు.