వకీల్ సాబ్ కు లైన్ క్లియర్

పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్. గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కూడా నిర్వహించారు. ఇప్పుడీ
సినిమాకు సంబంధించి మరో ఫార్మాలిటీ పూర్తయింది. వకీల్ సాబ్ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్
పూర్తయ్యాయి. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చింది. సినిమా నిడివి 2 గంటల 32 నిమిషాలు ఉంది.

హిందీ, తమిళ్ లో సూపర్ హిట్టయిన పింక్ అనే సినిమాకు రీమేక్ గా వకీల్ సాబ్ మూవీని తెరకెక్కించారు.
అయితే కేవలం లైన్ మాత్రమే తీసుకున్నారు. పవన్ ఇమేజ్, తెలుగు నేటివిటీకి తగ్గట్టు పూర్తిగా
మార్చేశారు. పవన్ క్యారెక్టర్ డిజైన్ తో పాటు.. అతడి కోసం 3 ఫైట్లు, 2 పాటలు కూడా పెట్టారు.

ఇలా పూర్తిగా మార్చేసిన ఈ సినిమా పింక్ ఫ్రాంచైజీలోనే ది బెస్ట్ రీమేక్ అంటోంది యూనిట్. ఈ వీకెండ్
ఎట్రాక్షన్ గా 9వ తేదీన వకీల్ సాబ్ సినిమా థియేటర్లలోకి వస్తోంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ
సినిమాలో అంజలి, అనన్య, నివేత థామస్ కీలక పాత్రలు పోషించారు. నివేత థామస్ కు కరోనా సోకడంతో ఆమె ప్రచారం కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.