మేజర్ హీరోయిన్ వచ్చేసింది

మేజ‌ర్ చిత్రంలోని క్యారెక్టర్ పోస్టర్‌లో మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ మ‌రియు అడివి శేష్ ల మ‌ధ్య
సారూప్యతలతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ రోజు ఈ మూవీలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న
న‌టి ‌సాయి మంజ్రేకర్ ఫ‌స్ట్ గ్లిమ్స్‌ని విడుద‌ల‌చేసిన చిత్ర యూనిట్‌. మేజ‌ర్ మూవీ టీజ‌ర్‌ను ఏప్రిల్ 12న
రిలీజ్ చేయబోతున్నారు.

ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్ యూనిఫామ్‌లో సాయి మంజ్రేకర్ మరియు ఆడివి శేష్ ఉన్న ఈ పోస్ట‌ర్
ఆక‌ట్టుకుంటోంది. అలాగే డిఫెన్స్ అకాడమికి సెల‌క్ట్ అయినందుకు లెట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెల‌ప‌డం
ఈ పోస్ట‌ర్లో చూపించారు.

టీనేజ్ నుండి యుక్తవయసు వరకు వైవిధ్యమైన దశలలో అడివి శేష్‌తో పాటు సాయి మంజ్రేకర్ పాత్ర
మ‌న‌కి క‌నిపిస్తోంది. తొలి చిత్రం ‘దబాంగ్ 3’ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న తరువాత సాయి మంజ్రేకర్
తెలుగులో న‌టిస్తోన్న మొద‌టి చిత్ర‌మిది.