డ్యూయల్ రోల్ కాదు.. డ్యూయల్ షేడ్స్

prabhas salaar movie

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా వస్తున్న
ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టే సినిమాపై పుకార్లు కూడా ఎక్కువయ్యాయి.
ఇప్పటికే పలు రూమర్లు పుట్టుకురాగా.. తాజాగా మరో పుకారు షికారు చేస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్
ద్విపాత్రాభినయం చేస్తున్నాడనేది ఆ పుకారు సారాంశం.

తన సినిమాపై రూమర్లు వచ్చిన ప్రతిసారి వెంటనే వాటిపై స్పందిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.
ఎలాంటి గాసిప్స్ కు తావులేకుండా వెంటవెంటనే క్లారిటీ ఇస్తున్నాడు. ఈసారి కూడా అదే పనిచేశాడు.
సలార్ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయడం లేదని క్లారిటీ ఇచ్చాడు.

ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేయడం లేదు. కాకపోతే రెండు షేడ్స్ లో మాత్రం
కనిపించబోతున్నాడు. ఒక షేడ్ లో గ్యాంగ్ స్టర్ గా, మరో షేడ్ లో మెకానిక్ గా కనిపించబోతున్నాడు. వచ్చే
ఏడాది ఏప్రిల్ 14న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా
నటిస్తోంది.