అందరి చూపు నితిన్ పైనే

Check February 19 release

రేపు ఏకంగా 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఎల్లుండి మరో సినిమా కూడా వస్తోంది. అయితే ఈ
మొత్తం 8 సినిమాల్లో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్న మూవీ చెక్ మాత్రమే. నితిన్ నటించిన ఈ సినిమాపై భారీ
అంచనాలున్నాయి.

చంద్రశేఖర్ యేలేటి, నితిన్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఇది. పైగా డిఫరెంట్ కాన్సెప్ట్.
ట్రయిలర్ పెద్ద హిట్. దీంతో చెక్ సినిమా అంచనాలు పెంచేసింది. రకుల్, ప్రియాప్రకాష్ హీరోయిన్లుగా
నటించిన ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనందప్రసాద్ నిర్మించారు.

ఈ వారం వస్తున్న సినిమాలేవీ చెక్ కు పోటీకావు. అక్షర, క్షణక్షణం, 70ఎంఎం, అంగుళీక, బాలమిత్ర,
లాయర్ విశ్వనాధం సినిమాలన్నీ చిన్నవే. వీటిపై ఎలాంటి బజ్ లేదు. సో.. ఆల్రెడీ విడుదలైన నాంది,
ఉప్పెన సినిమాలు మాత్రమే చెక్ కు పోటీ. థియేటర్లలో కొనసాగుతున్న ఈ రెండు సినిమాలకు నితిన్ చెక్
పెడతాడేమో చూడాలి.