చరణ్ సినిమాకు అనిరుధ్ సంగీతం

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో మూవీ లాక్ అయిన సంగతి తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ పై పాన్
ఇండియన్ సినిమాగా భారీ బడ్జెట్ తో రాబోతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ స్టార్ట్ చేయబోసే సినిమా
ఇదే. ఈ మూవీపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాడు దిల్ రాజు. మరీ ముఖ్యంగా సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేసే
బాధ్యతను పూర్తిగా శంకర్ కు అప్పగించాడు. శంకర్ సెలక్ట్ చేస్తున్న టెక్నీషియన్స్ ను ఆల్మోస్ట్ ఓకే
చేస్తున్నాడు.

ఇందులో భాగంగా చరణ్-శంకర్ సినిమాకు అనిరుధ్ ఎంపికయ్యాడు. అయితే ఈ విషయాన్ని ఇంకా
అధికారికంగా ప్రకటించలేదు. తెలుగులో అజ్ఞాతవాసి, గ్యాంగ్ లీడర్, జెర్సీ లాంటి సినిమాలకు సంగీతం
అందించాడు అనిరుధ్. అటు తమిళ్ లో నంబర్ వన్ మ్యూజీషియన్ గా కొనసాగుతున్నాడు. ఇలాంటి
సంగీత దర్శకుడ్ని, ఇప్పుడు మరోసారి తెలుగు తెరపైకి తీసుకొస్తున్నాడు దిల్ రాజు.

తన బ్యానర్ పై 50వ సినిమాగా రాబోతున్న ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు దిల్ రాజు.
మరోవైపు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించే మరో హీరో కోసం అన్వేషిస్తున్నారు. ముందుగా పవన్ కల్యాణ్
ను అనుకున్నప్పటికీ.. పాన్ ఇండియా అప్పీల్ కోసం కోలీవుడ్ నటుడ్ని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు.