నిర్మాతగా మారిన హీరోయిన్

మొన్ననే ప్రజెంటర్ గా మారింది హీరోయిన్ కాజల్. మను చరిత్ర అనే సినిమాకు సమర్పకురాలిగా
వ్యవహరిస్తోంది. ఇప్పుడు మరో హీరోయిన్ ఏకంగా నిర్మాతగా మారింది. ఆమె మరెవరో కాదు. చిన్నారి
పెళ్లికూతురుగా గుర్తింపు తెచ్చుకున్న అవికా గౌర్. అవును.. ఇప్పుడీ ముద్దుగుమ్మ ప్రొడ్యూసర్ గా మారింది.
ఆ సినిమాలో తను హీరోయిన్ గా కూడా నటిస్తోంది.

అవికా స్క్రీన్ క్రియేషన్స్ పేరుతో ఆమె ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించింది. ఆచార్య క్రియేషన్స్‌, అవికా
స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో ఓ సినిమా వస్తోంది. ఈ సినిమాలో అవికా గోర్ హీరోయిన్. సాయి
రోనక్ హీరో. ఈ చిత్రానికి ఎం.ఎస్. చలపతి రాజు సహ నిర్మాత. ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ మురళీ నాగ
శ్రీనివాస్ గంధం దర్శకత్వం వహించనున్నారు.

“నా చిన్నతనం నుంచి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఇక్కడ ప్రతి అంశాన్ని నిశితంగా గమనించా.
అందుకని, ప్రొడక్షన్ లోకి రావాలని అనుకుంటున్నాను. ఆచార్య క్రియేషన్స్ కోసం రాసిన కథను మురళీ
నాగ శ్రీనివాస్ గంధం నాకు చెప్పారు. దర్శకుడు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. నిర్మాతగా నా తొలి
సినిమాకు ఇదే సరైన కథ అనుకున్నాను. దాంతో నేనూ ప్రొడక్షన్ లో పార్ట్ అవుతానని చెప్పా.”

ఇలా తను నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చిందో వివరించింది అవికా గౌర్. చాలా కష్టపడి స్లిమ్ గా
మారింది ఈ హీరోయిన్. ఆమె స్లిమ్ గా మారిన తర్వాత చేస్తున్న తొలి సినిమా ఇదే.