త్వరలో ఎన్టీఆర్ రియాలిటీ షో

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలతో పాటు టెలివిజన్ షో తో కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. తారక్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ఏ రేంజ్ లో హిట్ అయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు మరోసారి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతునున్నాడు తారక్. ఆల్రెడీ టీవీ తెరపై ఓ సారి అలరించిన యన్టీఆర్ మరోసారి సరికొత్తగా వినోదాన్ని అందిచేందుకు సిద్ధమయ్యాడు. టీవీ షోల్లో బాగా సక్సెస్ రేట్ ఉన్న రియాలిటీ షో కాన్సెప్ట్ నే తారక్ ఎంచుకున్నాడు. ఈ షో కోసం పాపులర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ జెమిని టీవీ(సన్ నెట్వర్క్) భారీ ఎత్తున ప్లాన్ చేస్తోంది. తారక్ హోస్ట్‌గా వ్యవహరించబోయే ఈ షో ని సరికొత్తగా డిజైన్ చెయ్యడంతో పాటు దీనికి గానూ ఎన్టీఆర్‌కి హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఇవ్వబోతుందట. ఇప్పటికే పలు టీవీ ఛానెళ్లు రకరకాల ఎంటర్ టైన్ మెంట్, రియాలిటీ షోస్ తో దూసుకెళ్తున్నాయి. వాటికి రేటింగ్ కూడా బాగానే వస్తోంది. అందుకే వాటికి కాంపిటీషన్ గా జెమినీ టీవీ తారక్ తో ఓ కొత్త షో ప్లాన్ చేస్తుంది. మార్చిలో షూటింగ్ స్టార్ట్ చేసి ఏప్రిల్ నుండి షోను టెలికాస్ట్ చేసే ప్లాన్‌లో ఉన్నారు టీవీ యాజమాన్యం.