ఈమె పేరు ఎప్పుడు బయటపెడతారో…

‘సర్కారువారి’ పాట సినిమాకు సంబంధించి ఆమధ్య మరో హీరోయిన్ పేరు కూడా వినిపించింది. ఆమె మరెవరో కాదు, మహేష్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా రాబోతున్న ఈ సినిమాలో ఆమెను కూడా తీసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. నిజానికి ఈ సినిమాలో ఆమె కూడా ఉంది.

”సర్కారువారి పాట” సినిమాలో సెకెండ్ హీరోయిన్ పాత్ర కోసం సయీ మంజ్రేకర్ ను తీసుకున్నారు. స్వయంగా నమ్రత శిరోద్కర్ రిఫర్ చేసి మరీ సయీని ఈ ప్రాజెక్టులోకి తీసుకుందని టాక్. అయితే ఆ విషయాన్ని ఇప్పటివరకు బయటపెట్టలేదు మేకర్స్.

దీంతో ”సర్కారువారి పాట” సినిమాలో సయీ మంజ్రేకర్ ఉందా లేక ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకున్నారా అనే చర్చ ఊపందుకుంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న కీర్తిసురేష్ పై కూడా గతంలో ఇలాంటి పుకార్లే వచ్చాయి. ఆమెను తప్పించారంటూ ప్రచారం జరిగింది. స్వయంగా మహేష్ తో పాటు యూనిట్ ఆ ప్రచారంలో నిజం లేదని ఖండించారు.

ఇప్పుడు సయీ మంజ్రేకర్ విషయంలో కూడా అలాంటి ప్రకటన ఏదైనా వస్తే బాగుంటుంది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఓ ఆఫర్ కోల్పోయింది. వరుణ్ తేజ్ చేస్తున్న ఓ సినిమా నుంచి ఆఖరి నిమిషంలో సయీని తప్పించారు. ”సర్కారువాటి పాట” లో ఛాన్స్ లాక్ అయితే సయీ జాక్ పాట్ కొట్టినట్టే.