రిటైర్మెంట్ ప్రకటించిన పీవీ సింధు…

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కీలక నిర్ణయాన్ని వెలువరించారు. బ్యాడ్మింటన్‌కు ఆమె గుడ్‌బై చెప్పేశారు. ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు పీవీ సింధు ప్రకటించారు. ఆటలో తాను సాధించాలనుకున్నది సాధించానన్నారు… ఈ మేరకు ట్వీట్ చేశారు.

డెన్మార్క్‌ ఓపెన్‌ తన కెరీర్‌లో చివరి టోర్ని అవుతుందని పీవీ సింధు ప్రకటించారు.
కరోనా తెచ్చిన అనిశ్చిత పరిస్థితులు ఆందోళనకు గురిచేశాయని సింధు వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితులు ఎప్పటి వరకు కొనసాగుతాయో తెలియడం లేదన్నారు.

ఇప్పుడున్న గందరగోళ పరిస్థితుల్లో ఆటలో కొనసాగలేనని ట్వీట్‌లో వివరించారు. రిటైర్మెంట్ నిర్ణయం అభిమానుల గుండెలు పగిలేలా చేస్తుందని తనకూ తెలుసన్నారు. కరోనా మహమ్మారి తనకు కనువిప్పుగా మారిందని సింధు చెప్పారు.