పుకార్లు బాగున్నాయి ఇంకా చెప్పండి

పుకార్లు వస్తే ఎవరైనా ఖండిస్తారు. హీరోయిన్ హెబ్బా పటేల్ మాత్రం ఎంజాయ్ చేస్తోంది. పుకార్లు బాగున్నాయి ఇంకా క్రియేట్ చేయండి అంటూ ఎంకరేజ్ చేస్తోంది. అయితే హెబ్బా కావాలని ఇలా అనడం లేదు, విసుగెత్తి ఇలా కామెంట్ చేస్తోంది.

ఈ ముద్దుగుమ్మపై ఎప్పటికప్పుడు పుకార్లు వస్తూనే ఉన్నాయి. డేటింగ్ లో ఉందని కొన్నాళ్లు.. త్వరలోనే పెళ్లి అంటూ మరికొన్నాళ్లూ.. ఓ టాలీవుడ్ హీరోతో ఎఫైర్ అంటూ ఇంకోసారి.. ఇలా పుకార్లు వస్తూనే ఉన్నాయి.

తనపై వచ్చిన పుకార్లను ఒకసారి ఖండించానని, రెండోసారి కూడా ఖండించానని, ముచ్చటగా మూడోసారి కూడా క్లారిటీ ఇచ్చానని.. ఇక పుకార్లపై స్పందించే ఓపిక తనకు లేదని అంటోంది హెబ్బా. ఎవరైనా తనపై రూమర్లు క్రియేట్ చేయాలనుకుంటే కొత్తకొత్తవి రాయమని చెబుతోంది. అదీ సంగతి.