పూజా హెగ్డే పని మొదలైంది

టాలీవుడ్ లో మరో పెద్ద సినిమా సెట్స్ పైకి వచ్చింది. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇప్పటికే నాగార్జున, నాగచైతన్య సెట్స్ పైకి రాగా.. ఇప్పుడు అఖిల్ కూడా సెట్స్ పైకి వచ్చేశాడు. అంతేకాదు.. హీరోయిన్ పూజా హెగ్డే కూడా సెట్స్ పైకి వచ్చేసింది. అఖిల్-పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ఫ్రెష్ షెడ్యూల్ మొదలైంది. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా, దాదాపు 7 నెలల తర్వాత ఇలా మళ్లీ ప్రారంభమైంది.

ఈ లాక్ డౌన్ టైమ్ లో బెంగళూరులో ఉండిపోయింది పూజా హెగ్డే. దాదాపు 5 నెలలు అక్కడే లాక్ అయిపోయింది. ఇప్పుడీ సినిమా కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. మొన్ననే హైదరాబాద్ వచ్చిన పూజా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సెట్స్ పైకి వచ్చింది.

ఈ నెలలోనే ఆమె రాధేశ్యామ్ మూవీని కూడా స్టార్ట్ చేయబోతోంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా సెట్ వేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో వారం రోజుల్లో ఆ షెడ్యూల్ కూడా మొదలవుతుంది.