అమరావతి స్కాం నిందితులకు హైకోర్టులో భారీ ఊరట

అమరావతి భూకుంభకోణంలో నిందితులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో హైకోర్టు సంచలన ఉత్తర్వులు ఇచ్చింది. నిందితులపై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌లోని విషయాలను ప్రచురించడం గానీ, ప్రసారం చేయడం గానీ చేయకూడదని అరుదైన ఆదేశాలను ఇచ్చింది.

సోషల్ మీడియాలో కూడా ఎఫ్‌ఐఆర్‌ కాపీని ప్రచారం చేయడానికి వీల్లేదని ఆదేశించింది. దాంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న 12 మందికి ఊరట లభించింది.

తదుపరి విచారణను మరో నాలుగు వారాల పాటు వాయిదా వేసింది హైకోర్టు. ఈ కేసు వివరాలను ప్రచురించకూడదని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలను ప్రచురించకుండా మీడియా సంస్థలు సంయమనం పాటిస్తున్నాయి.