వచ్చే నెల 21 నుంచి రాజధాని కేసు రోజువారీ విచారణ

మూడు రాజధానుల కేసుపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 21 నుంచి రోజువారీగా విచారణ జరుపుతామని తెలిపింది. నేడు ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు.. తదుపరి విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది. ఆలోపు దాఖలైన అన్ని పిటిషన్లకు కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కేసును త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో … వచ్చే నెల 21 నుంచి రోజువారీగా కేసు విచారణ జరిపి కేసును పరిష్కరించేందుకు హైకోర్టు సిద్ధపడినట్టుగా ఉంది. వచ్చే వాయిదా నుంచి భౌతిక దూరం పాటిస్తూ నేరుగా విచారణ జరిపించేందు కోర్టు సంసిద్ధత వ్యక్తం చేసింది.

అటు విశాఖలో స్టేట్ గెస్ట్‌ హౌజ్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌కూ కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.