ఈసారి రెండు సినిమాలు చేస్తాడట

చేతిలో ఉన్న సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. పూర్తయిన తర్వాత ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. అయితేనేం రవితేజ ప్లాన్స్ మాత్రం భారీగా ఉన్నాయి. ఎప్పుడు సెట్స్ పైకి వస్తాడో చెప్పలేని ఈ హీరో, ఇప్పుడు ఏకంగా 2 సినిమాలు ప్రకటించే ప్లాన్ లో ఉన్నాడు. అంతేకాదు, ఆ రెండు సినిమాల్ని ఒకేసారి సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచన కూడా చేస్తున్నాడట.

రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు రవితేజ. అలాగే త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో కామెడీ డిటెక్టివ్ గా కూడా కనిపించబోతున్నాడు. ఈ రెండు సినిమాల్ని ఒకేసారి స్టార్ట్ చేసి, సమాంతరంగా షూటింగ్ పూర్తిచేయాలని భావిస్తున్నాడట రవితేజ.

ప్లానింగ్ అయితే బాగుంది కానీ, ఆ షూటింగ్ ఎప్పుడనేదే ఇప్పుడు అందరి డౌట్. ప్రస్తుతం క్రాక్ సినిమా చేస్తున్నాడు రవితేజ. జస్ట్ వారం రోజులు సెట్స్ పైకి వస్తే ఈ సినిమా షూట్ కంప్లీట్ అయిపోతుంది. కానీ ఆ వారం రోజుల షూటింగ్ కు కూడా రానని చెప్పేశాడు రవితేజ. అలాంటి హీరో, ఇప్పుడు ఏకంగా 2 సినిమాల్ని ఒకేసారి కంప్లీట్ చేస్తానంటూ స్టేట్ మెంట్స్ ఇస్తున్నాడట. ఈ ముచ్చట ఎప్పటికి తీరుతుందో.