ఆమెకు 14 మందితో ఎఫైర్స్… భర్త నిఘాతో బట్టబయలు

ఆమెది ఒక అందమైన జీవితం. భర్త పెద్ద వ్యాపారస్తుడు. చేతినిండా డబ్బు.. నౌకర్లు.. భర్త అందించే అమితమైన ప్రేమ. ఇవేవీ ఆమెకు సంతృప్తి ఇవ్వలేకపోయాయి. బయట స్నేహాలకు అలవాటు పడింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏక కాలంలో ఏకంగా 14 మందితో ఎఫైర్లు నడిపింది. కానీ భర్తకు అనుమానం వచ్చి ఆరా తీస్తే ఆమె అసలు స్వరూపం బయటపడింది. వివరాల్లోకి వెళితే..

కోల్‌కతాకు చెందిన ఒక వ్యాపారవేత్తకు కొన్నాళ్ల క్రితం ఒక యువతితో వివాహం అయ్యింది. పెళ్లైన నాటి నుంచి అతను భార్యను ఎంత ప్రేమగా చూసుకున్నా.. ఆమె మాత్రం అతడితో సఖ్యతగా ఉండేది కాదు. ఎప్పుడూ ఫోన్స్ మాట్లాడటం.. బయటకు వెళ్లడం చేస్తుండేది. దీంతో అనుమానం వచ్చిన భర్త ఒక ప్రైవేట్ డిటెక్టీవ్‌ను ఏర్పాటు చేసి ఆమెపై నిఘా పెట్టాడు.

ఆ యువతి కదలికలను పూర్తిగా అధ్యయనం చేసిన డిటెక్టీవ్ విస్తుపోయే నిజాలు భర్తకు అందించాడు. తన భార్య ఒకరికి తెలియకుండా మరొకరితో సంబంధాలు నెరుపుతుందని.. మొత్తం 14 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని తేల్చాడు. ఆ విషయం తెలిసిన భర్త తట్టుకోలేక పోయాడు. తనను మోసం చేసిన భార్యతో పాటు ఆ యువకులకు కూడా బుద్ది చెప్పాలనుకున్నాడు.

తన భార్య వివాహేతర సంబంధంతో తన పరువు పోయిందంటూ రూ. 100 కోట్లకు పరువునష్టం దావా వేశాడు. ఈ నోటీసులు కేవలం భార్యకే కాకుండా ఆ 14 మంది బాయ్ ఫ్రెండ్స్‌కు కూడా పంపాడు. తనకు పరువు నష్టం కింది రూ.100 కోట్లు చెల్లించక పోతే లీగల్ చర్యలు తీసుకుంటానని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆమె బాయ్ ఫ్రెండ్స్ తలలు పట్టుకున్నారు.