మహేష్ “పాట” మొదలైంది

సర్కారు వారి పాట.. మహేష్ కొత్తగా ప్రకటించిన ఈ సినిమా. పరశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ లేదనే విషయం తేలిపోయింది. దీంతో మ్యూజిక్ సిట్టింగ్స్ పై కన్నేశాడు పరశురామ్. సినిమాకు సంబంధించి పాటల కంపోజిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది.ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

లాక్ డౌన్ కారణంగా చెన్నైలోని తన ఇంటికే పరిమితమైపోయాడు తమన్. అయితే అతడికి తను ఉంటున్న అపార్ట్ మెంట్ లోనే పై ఫ్లోర్ లో రికార్డింగ్ స్టుడియో ఉంది. కాబట్టి సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన వర్క్ ను ఆల్రెడీ స్టార్ట్ చేశాడు తమన్.

పరశురామ్ చెప్పిన సందర్భానికి తగ్గట్టు 2 ట్యూన్స్ కంపోజ్ చేసి వాటిని మహేష్, పరశురామ్ కు పంపించాడు తమన్. వీటిలో ఒక ట్యూన్ ను మహేష్ ఓకే చేసినట్టు తెలుస్తోంది. సెట్స్ పైకి వెళ్లే లోపు కనీసం 3 పాటలైనా ఫైనలైజ్ చేయాలనే టార్గెట్ తో అంతా పనిచేస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ బ్యానర్లపై రాబోతోంది సర్కార్ వారి పాట. ఈ సినిమాలో హీరోయిన్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు. సెట్స్ పైకి వెళ్లేలోపు ఆ పని కూడా పూర్తిచేయబోతున్నారు.