వరల్డ్ ఫేమస్ లవర్ ఫైనల్ కలెక్షన్

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా మొదటి రోజే అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. స్టోరీలైన్ వీక్ గా ఉండడంతో పాటు చాలా చోట్ల అర్జున్ రెడ్డి ఛాయల్ని రిపీట్ చేయడంతో సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు. ఈ క్రమంలో తాజాగా తన ఫైనల్ రన్ పూర్తిచేసుకుంది వరల్డ్ ఫేమస్ లవర్.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కేవలం 8 కోట్ల 18 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. కానీ సినిమాను మాత్రం హయ్యర్స్ తో కలిపి 31 కోట్ల రూపాయలకు అమ్మారు. అంటే.. బయ్యర్లకు అటుఇటుగా 23 కోట్ల రూపాయల నష్టం అన్నమాట. విజయ్ దేవరకొండ కెరీర్ లో ఇంత నష్టం చవిచూసిన సినిమా మరొకటి లేదు.

నష్టాల పరంగా మొన్నటివరకు నోటా సినిమానే దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్. ఇప్పుడా రికార్డును 23 కోట్ల రూపాయల నష్టంతో వరల్డ్ ఫేమస్ లవర్ క్రాస్ చేశాడు. అటు ఓవర్సీస్ లో ఈ సినిమాకు కోటి రూపాయల షేర్ కూడా రాలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన ఫైనల్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 4.12 కోట్లు
సీడెడ్ – రూ. 0.74 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.86 కోట్లు
ఈస్ట్ – రూ. 0.54 కోట్లు
వెస్ట్ – రూ. 0.42 కోట్లు
గుంటూరు – రూ. 0.72 కోట్లు
నెల్లూరు – రూ. 0.30 కోట్లు
కృష్ణా – రూ. 0.50 కోట్లు