సాక్షి ని తప్పుపట్టిన జగన్

టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా మేనేజ్ మెంట్ లో కింగ్ అని ఆయనను దగ్గర నుంచి చూసిన వారు అభిప్రాయపడుతుంటారు. దేన్నైనా సరే మీడియాతో తిమ్మిని బమ్మి చేస్తారనే పేరు ఆయనకు ఉంది.

అయితే చంద్రబాబుకు బలంగా ఉన్న మీడియా.. అదే అధికార పార్టీ వైసీపీకి, జగన్ కు మాత్రం బలహీనంగా మారిపోవడమే ఇప్పుడు వైసీపీ శ్రేణులను ఆవేదనకు గురిచేస్తోందట.

తాజాగా సన్న బియ్యంపై చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ సన్న బియ్యం అని తాను మేనిఫెస్టోలో పెట్టలేదని.. నాణ్యమైన బియ్యం మాత్రం ఇస్తాననన్నానని.. నాణ్యమైన బియ్యానికీ సన్నబియ్యానికీ తేడా తెలియకుండా సాక్షి పేపర్ లో తప్పు రాశారని స్వయంగా చెప్పుకున్నారు.

తన సొంత పత్రిక.. పైగా అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ఏమాత్రం అవగాహన లేకుండా రాసిన దాన్ని జగన్ సైతం తప్పు పట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్షాలకు ఆయుధమిచ్చేలా సాక్షి ఏమాత్రం ఫీల్డ్ వర్క్ లేకుండా ఇలా ప్రచురించడాన్ని జగన్ తప్పు పట్టారు.

సొంత పార్టీ, ప్రభుత్వానికి బలంగా ఉండాల్సిన సాక్షి ఇలా బలహీనమైపోవడంపై వైసీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.