ముంబైలో నేడు బీసీసీఐ కీలక సమావేశం

  • లోథా కమిటీ సంస్కరణలకు సవరణలు
  • సౌరవ్ గంగూలీ నేతృత్వంలో తొలిసమావేశం

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు 88వ సర్వసభ్య సమావేశానికి ముంబైలో రంగం సిద్ధమయ్యింది. సౌరవ్ గంగూలీ అధ్యక్షతన ఈ రోజు జరిగే సమావేశంలో పలు కీలకనిర్ణయాలు తీసుకోనున్నారు. సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లోథా సూచించిన సంస్కరణలలో భాగంగా అనుసరిస్తున్న నిబంధనలకు సవరణలు చేపట్టనున్నారు.

బీసీసీఐకి అనుబంధంగా ఉన్న వివిధ క్రికెట్ సంఘాల ప్రతినిధులు ఈ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గోనున్నారు. ప్రస్తుత చైర్మన్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షాల పదవీకాలాన్ని 10 మాసాల నుంచి రెండు సంవత్సరాలకు పెంచడానికి వీలుగా లోథా కమిటీ నిబంధనకు సవరణ చేయనున్నారు.

అంతేకాదు…70 సంవత్సరాలకు పైగా వయసు పైబడిన సభ్యుల అనుభవం ఆధారంగా సేవలు వినియోగించుకోడానికి వీలుగా సవరణ చేపట్టునున్నారు.

ఐసీసీ నుంచి వేల కోట్ల రూపాయల బకాయిలు రాబట్టడానికి అపార అనుభవం ఉన్న ఎన్. శ్రీనివాసన్ ను ఐసీసీలో భారత ప్రతినిధిగా నియమించాలని సౌరవ్ గంగూలీ అండ్ కో నిర్ణయించారు.

బీసీసీఐ 88వ సర్వసభ్యసమావేశం చేపట్టే సవరణలను సుప్రీంకోర్టు, జస్టిస్ లోథా ఏ విధంగా స్వీకరిస్తారో మరి.