భారత్ లో సఫారీసేన పాగా

  • తీన్మార్ టీ-20, టెస్ట్ సిరీస్ కు కౌంట్ డౌన్ 
  • న్యూఢిల్లీ చేరుకొన్న సౌతాఫ్రికా టీమ్

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ భారత్ తో మూడుమ్యాచ్ ల ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లో పాల్గొనటానికి సౌతాఫ్రికా క్రికెట్ జట్టు న్యూఢిల్లీ చేరుకొంది.

టెస్ట్ సిరీస్ కు ముందు…తీన్మార్ టీ-20 సిరీస్ లో సైతం సఫారీ టీమ్ తలపడనుంది. సౌతాఫ్రికా టీ-20 జట్టుకు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ క్వింటన్ డి కాక్ నాయకత్వం వహిస్తున్నాడు.

15 నుంచి టీ-20 సిరీస్ 

మూడుమ్యాచ్ ల సిరీస్ లోని తొలి టీ-20 మ్యాచ్ ధర్మశాలలోని హిమాచల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 15న ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

సెప్టెంబర్ 18న మొహాలీ వేదికగా రెండో టీ-20, బెంగలూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా మూడో టీ-20 మ్యాచ్ నిర్వహిస్తారు.

అక్టోబర్ 2 నుంచి టెస్ట్ సిరీస్..

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా భారత్, సౌతాఫ్రికాజట్ల మధ్య జరిగే మూడుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ అక్టోబర్ 2న విశాఖపట్నం వేదికగా ప్రారంభంకానుంది.

సిరీస్ లోని రెండోటెస్ట్ అక్టోబర్ 10 నుంచి 14 వరకూ పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగాను, ఆఖరి టెస్ట్ రాంచీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా 19 నుంచి 23 వరకూ జరుగుతాయి.