ఈసారి తన లుక్ మారుస్తున్న ప్రభాస్

‘బాహుబలి’ సినిమా తరువాత ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా, కలెక్షన్ల పరంగా మాత్రం బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

అయితే ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ పైన కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. కొన్ని సీన్లు బొద్దుగా కనిపించిన ప్రభాస్ కొన్ని సీన్లలో డిఫరెంట్ గా కనిపించాడు. తన హెయిర్ స్టైల్ కూడా అంతగా బాగోలేదు. అన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు ప్రభాస్ లుక్ పై కూడా కాంసెంట్రేట్ చేస్తే బాగుండేదని కొందరు అభిమానులు చిత్రబృందం పై ఫైర్ అవుతున్నారు.

అయితే ఇవన్నీ చూశాక ప్రభాస్ ఇప్పుడు కొత్త లుక్ పై దృష్టి పెట్టాడట.

ఇప్పటికే తన తదుపరి సినిమా కోసం నెల రోజుల షూటింగ్ చేసిన ప్రభాస్… ఇప్పుడు సినిమాలో తన లుక్ పై దృష్టి పెట్టనున్నారు.

పీరియడ్ లవ్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సంవత్సరం ఆఖరిలో ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలుకానుంది.

‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.