‘మీకు మాత్రమే చెప్తా’: చెప్పేది అలా… చేసేది ఇలా..!

‘పెళ్లిచూపులు’ సినిమాతో దర్శకుడిగా అందరి దృష్టిని ఆకర్షించిన తరుణ్ భాస్కర్ ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. తరుణ్ భాస్కర్ హీరోగా విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

‘మీకు మాత్రమే చెప్తా’ అనే ఆసక్తికరమైన టైటిల్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. అభినవ్ గోమాటం, నవీన్ జార్జ్, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, పావని గంగిరెడ్డి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

కేవలం నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ అన్ని రకాల చెడు అలవాట్లు ఉన్న అబ్బాయి గా కనిపిస్తాడు. కానీ ఒక అమ్మాయి అడిగితే మాత్రం తనకు అలాంటి అలవాట్లు ఏమీ లేవు అంటూ చెబుతాడు.

ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. టీజర్ చూస్తేనే సినిమా ఫుల్ లెన్త్ ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది అని అర్థమవుతుంది. షమ్మీర్ సుల్తాన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి శివకుమార్ సంగీతం అందిస్తున్నాడు.