డాక్ట‌ర్ సూసైడ్ కేసులో కొత్త మ‌లుపు !

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంకు చెందిన డాక్టర్ ఫ్యామిలీ ఆత్మహత్య కేసు కొత్త మ‌లుపు తీసుకుంది. అమలాపురంలో ఆర్థోపెడిక్ వైద్యుడిగా మంచి పేరున్న పెనుమత్స రామకృష్ణరాజు … తన భార్య, పెద్ద కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. పాయిజన్ ఇంజెక్షన్‌ తీసుకోవడం ద్వారా ముగ్గురూ ప్రాణాలు తీసుకున్నారు.

ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమ‌ని మొద‌ట పోలీసులు భావించారు. అయితే డాక్ట‌ర్ కు అప్పులు ఎలా అయ్యాయి? ఎవ‌రైనా మోసం చేశారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తే కొత్త విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వరికూటి వెంకట వేణుధరప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కోడూరు మండ‌లం అవ‌నిగ‌డ్డ‌కు చెందిన వెంక‌ట వేణు ధ‌ర్మ‌ప్రసాద్ డాక్ట‌ర్ ఫ్యామిలీతో హైద‌రాబాద్‌లో పరిచ‌య‌మైన‌ట్లు తెలుస్తోంది. మాయమాటలతో ”రైస్ పుల్లింగ్” పేరుతో డాక్టరుని మోసం చేశాడని పోలీసులు భావిస్తున్నారు. హైద‌రాబాద్ రైస్ పుల్లింగ్ మోస‌గాడిని అదుపులోకి తీసుకున్నారు.ఇంకా ఎవ‌రైనా ఈ కేసులో ఉన్నారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.