పావలా కల్యాణ్ అంటూ హీరోయిన్ల ట్వీట్… ట్రెండింగ్‌లో ”పావలా కల్యాణ్ హ్యాష్‌ ట్యాగ్‌”

ట్విట్టర్‌లో ఇటీవల హ్యాష్‌ టాగ్‌ల వార్‌ కూడా నడుస్తోంది. ప్రత్యర్థిని ఎత్తిపొడవడానికి హ్యాష్ ట్యాగ్‌లను రాజకీయ పార్టీల అభిమానులు వాడుతున్నారు. పవన్‌ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్‌లోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.

#HappyBirthdayPawanKalyan అంటూ ట్వీట్లు చేశారు. అయితే #HappyBirthdayPawanKalyan హ్యాష్ ట్యాగ్‌కు సమాంతరంగా #HappyBirthdayPawalaKalyan అనే హ్యాష్ ట్యాగ్ కూడా బాగా ట్రెండ్ అయింది. పవన్ కల్యాణ్‌కు పావలా కల్యాణ్‌కు ఒక అక్షరం మాత్రమే తేడా ఉండడంతో దాన్ని ఎవరూ పెద్దగా గమనించలేదు. దాంతో #HappyBirthdayPawanKalyanకు పోటీగా #HappyBirthdayPawalaKalyan ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

తెలుగుపై పట్టులేని హీరోయిన్లు, నటులు అయితే పావలా కల్యాణ్ హ్యాగ్‌ట్యాగ్‌తోనే పవన్‌ కల్యాణ్‌కు విషెష్ చెప్పారు. అలా చెప్పిన వారిలో కొమరం పులి హీరోయిన్ నికీషా పటేల్, ఈషా రెబ్బా కూడా ఉన్నారు. హ్యాపీ బర్త్‌డే పావలా కల్యాణ్ అన్న హ్యాష్‌ ట్యాగ్‌తో ఇద్దరూ ట్వీట్లు చేశారు. దాంతో వెంటనే ట్వీట్లు వైరల్ అయ్యాయి.

కాసేపటికి ఎవరి ద్వారానో పావలా కల్యాణ్ పదం వెనుక పరమార్ధాన్ని అర్థం చేసుకున్న నికీషా దాన్ని వెంటనే తొలగించారు. కానీ అప్పటికే స్క్రీన్ షాట్లు సేవ్ అయిపోయాయి.

పవన్ కల్యాణ్‌ను పావలా కల్యాణ్‌ అంటూ ట్వీట్‌ చేయడంపై జనసేన అభిమానులు నికీషా పటేల్‌పై విరుచుకుపడుతున్నారు. ఆమెను బండబూతులు తిడుతున్నారు. తెలియక జరిగిన పొరపాటు అని ఆమె క్షమాపణ కోరారు.