సీరియ‌ల్ న‌టుడి భార్య ఆత్మ‌హ‌త్య

ప్రముఖ సీరియ‌ల్ న‌టుడు మ‌ధుప్ర‌కాష్ భార్య ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. మణికొండ పంచవటి కాలనీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మధు ప్రకాష్ వేధింపులే ఆత్మహత్యకు కారణం అని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

మధు ప్రకాష్ బాహుబలి తో పాటు అనేక సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. లండన్ నుంచి వచ్చి 2 ఏళ్ల క్రితం మధుప్రకాశ్ ని భార‌తి పెళ్లి చేసుకుంది.

కొంత కాలంగా మరో సీరియల్ నటితో మధు ప్రకాష్ చనువుగా ఉండటంతో కుటుంబ కలహాలు మొద‌ల‌య్యాయి. ఈ విష‌యాన్ని పలుమార్లు పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

మ‌ధుప్ర‌కాష్ మాటీవీలో ప్ర‌సార‌మ‌య్యే కుంకుమ పువ్వు సీరియ‌ల్ లీడ్ రోల్‌లో న‌టిస్తున్నాడు. దీంతో పాటు ఈటీవీ సీరియ‌ల్స్ లో కూడా న‌టించాడు.