బీసీ హస్టల్ లో స్టూడెంట్ హత్య

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలోని బీసీ హాస్టల్‌లో దారుణం జరిగింది. మూడో తరగతి చదువుతున్న దాసరి ఆదిత్య హత్యకు గురయ్యాడు. హాస్టల్ బాత్ రూమ్ లో దారుణంగా ఆదిత్యను కత్తితో గొంతుకోసి చంపారు. తెల్లవారేసరికి రక్తపుమడుగులో పడి ఉన్న ఆదిత్య డెడ్ బాడీ చూసి విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చల్లపల్లి సీఐ వెంకటనారాయణ, ఎస్సై నాగరాజు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను పరిశీలించి విచారణ చేపట్టారు. ఆదిత్య మెడవద్ద కత్తితో కోసినట్లుగా ఉందని పోలీసులు చెబుతున్నారు.

అయితే విద్యార్థి ప్రమాదవశాత్తు మరణించాడా? లేదా ఎవరైనా హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెడపై కత్తిగాటు ఉండటంతో విద్యార్థిని ఎవరైనా హత్య చేసి ఉంటారనే అనుమానాలు బలపడుతున్నాయి.

దాసరి రవి, ఆదిలక్ష్మి దంపతులకు మొత్తం నలుగు పిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. అందులో చివరి వాడు దాసరి ఆదిత్య. థర్డ్ క్లాస్ చదువుతున్నాడు. హాస్టల్ కి ఇల్లు రెండు కిలోమీటర్ల దూరం. బీసీ హాస్టల్ లో ఆదిత్య అన్నయ్య అశోక్ తో కలిసి ఉంటాడు.

కింద రూమ్ లో పడుకున్న బాలుడు రాత్రి పైకి ఎందుకు వచ్చాడో తెలీదు. తెల్లారేసరికి బాత్ రూమ్ లో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. బాత్ రూమ్ కి డోర్ లేదు. దీంతో ఈ ఘటన పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హాస్టల్ వాచ్ మెన్ నాగబాబు….

వార్డెన్ కూడా రాత్రి హాస్టల్ లో లేడు. ఉదయాన్నే పిల్లలను 5 గంటలకు నిద్రలేపిన వాచ్ మెన్ కి ఆదిత్య కనిపించడం లేదు అని చెప్పారు. ఇంటికి వెళ్ళాడేమో కనుక్కోమని అతని అన్నయ్య అశోక్ ని, ఇంకొక పిల్లాడిని ఇంటికి పంపారు. ఇంతలో బాత్ రూమ్ లో పిల్లాడు రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడని చెప్పగా పైకి పరిగెత్తుకుంటూ వచ్చి హాస్పిటల్ కి తీసుకుని వెళ్దామని బాత్ రూమ్ నుండి బయటకు తీసుకుని వచ్చారు. అప్పటికే చనిపోయి ఉండడంతో… పోలీసులకు సమాచారం ఇచ్చారు. కింద రూమ్ లో అందరితో పడుకోవాల్సిన పిల్లాడు పైకి ఎందుకు వెళ్ళాడు? అనేది మిస్టరీగా మారింది.