బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఇతడేనట !

బిగ్ బాస్ రెండో వారానికి చేరుకుంది. హౌస్ లోని కంటెస్టెంట్స్ అంతా వివిధ టాస్క్ లు, గేములు, కళా ప్రదర్శనల్లో తమ సత్తా చాటుతున్నారు. శనివారం రోజు నాగార్జున సందడి చేశారు. ఈ వారం ఏకంగా ఎనిమిది మంది నామినేషన్లలో ఉండడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ శనివారం హోస్ట్ నాగార్జున ప్రారంభించారు. ఇంట్లో ఉన్న మొత్తం 8 మందిలో నలుగురు సేఫ్ అంటూ నాగార్జున ప్రకటించారు. తొలి సేఫ్ కంటెస్టెంట్ గా మహేష్ విట్టా కాగా.. ఆ తర్వాత హిమజ, రాహుల్ లు ఓట్ల ద్వారా బిగ్ బాస్ ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యారు. ఇక నాలుగో సేఫ్ కంటెస్టెంట్ గా శ్రీముఖి గట్టెక్కడంతో ఊపిరి పీల్చుకుంది.

ఉన్న ఎనిమిది మందిలో నలుగురు పోగా.. ఎలిమినేషన్ రేసులో వితికా-వరుణ్, జాఫర్, పునర్నవిలు ఉన్నారు. ఈ నలుగురిలో ఎవరు ఎలిమినేషన్ అన్నది నాగార్జున నాన్చారు.

ప్రస్తుతం బిగ్ బాస్ ఆదివారం షో శనివారం షూట్ చేస్తారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది జాఫరేనని టాక్ బయటకు వచ్చింది. జాఫర్ హౌస్ లో ఏ టాస్క్ చేయకుండా.. ఎందులోనూ ఉత్సాహంగా పాల్గొనకుండా ముభావంగా ఉంటున్నాడు. దీంతో అతడికే ఓట్లు తక్కువగా పడ్డట్టు సమాచారం. ఈ ఆదివారం అతడినే నాగార్జున ఎలిమినేట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. చూద్దాం మరీ ఈ ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారో..?