కేఫ్‌ కాఫీ డే అధినేత మృతదేహం లభ్యం

కేఫ్ కాఫీ డే అధినేత సిద్ధార్థ్ మిస్సింగ్ వ్యవహారం విషాదాంతమైంది. సిద్ధార్థ్‌ నేత్రావతి నదిలో శవమై కనిపించారు. రెండు రోజుల క్రితం నుంచి కనిపించకుండాపోయిన సిద్ధార్థ్‌ కోసం గజ ఈతగాళ్ల సాయంతో నేత్రావతి నదిలో గాలించారు. చివరకు అతడి మృతదేహాన్ని గుర్తించారు.

ఉద్యోగులకు లేఖ రాసిన సిద్ధార్థ్‌ తన వ్యాపారంలో వచ్చిన కష్టనష్టాలను వివరించారు. తానో విఫలమైన పారిశ్రామికవేత్తగా చెప్పుకుని ఆవేదన చెందారు. ఆర్థిక ఇబ్బందులు, ఐటీ అధికారుల వేధింపుల వల్లే సిద్ధార్థ్ ఆత్మహత్య చేసుకున్నారని ఆయన సన్నిహితులు కొందరంటున్నారు.

రెండు రోజుల క్రితం డ్రైవర్‌తో కలిసి కారులో బయలుదేరిన సిద్ధార్థ్‌… నేత్రావతి నది వద్దకు రాగానే కారు ఆపాల్సిందిగా డ్రైవర్‌ను ఆదేశించారు. కాసేపు నది వద్ద తిరిగిన సిద్ధార్థ్‌ అనంతరం కనిపించకుండాపోయారు. డ్రైవర్ సమాచారంతో పెద్దెత్తున గాలింపు చేపట్టారు. చివరకు సిద్ధార్థ్ శవమై కనిపించాడు. సిద్ధార్థ్ … కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఎం కృష్ణ అల్లుడు.