ఇంటర్ విద్యార్థులకూ ‘అమ్మఒడి’

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో భాగమైన అమ్మఒడి పథకాన్ని మరింత మంది విద్యార్థులకు లబ్ది చేకూరేలా విస్తరించారు. ఇప్పటి వరకు పదవ తరగతి వరకు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకే పరిమితం చేసిన ఈ పథకానికి సవరణలు చేశారు.

ఇవాళ విద్యాశాఖపై సీఎం జగన్ చేసిన సమీక్ష అనంతరం ఈ సవరణలు రూపొందించారు. ఇకపై ఇంటర్ విద్యార్థులతో పాటు హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులకు కూడా అమ్మఒడి పథకం ద్వారా ఏడాదికి 15వేల రూపాయల చొప్పున అందనుంది.

ఈ పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు కూడా విస్తరించడం ద్వారా పదవ తరగతి తర్వాత ఉండే డ్రాపవుట్స్‌ను తగ్గించే అవకాశం ఉన్నట్లు అధికారులు సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.