ఫ్యాన్స్ కోసం జూన్ లో ప్లాన్ చేసిన…. సాహో

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో వస్తున్న చాలా సినిమా లలో స్పెషల్ సినిమా సాహో. గత రెండు ఏళ్ళు గా చిత్రీకరణ దశ లో ఉన్న ఈ సినిమా ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు దర్శక నిర్మాతలు.

సుజీత్ దర్శకుడి గా యువీ క్రియేషన్స్ బానర్ పైన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ హీరో గా శ్రద్ధ కపూర్ హీరో, హీరోయిన్ లుగా రానున్న ఈ సినిమా లో ఇతర భాషలకి సంబందించిన నటీ నటులు చాలా మంది ఉన్నారు.

ఒకేసారి తెలుగు, తమిళ మరియు హిందీ భాషల్లో ఈ సినిమా ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రచారాల్లో భాగం గా సినిమా కి సంబంధించి కేవలం పోస్టర్స్ మరియు మేకింగ్ వీడియోస్ మాత్రమే వచ్చాయి.

అభిమానులని పూర్తి స్థాయి లో అవి సంతృప్తి పరచలేకపోయాయి. అందుకే కాబోలు ఇపుడు చిత్ర యూనిట్ అభిమానుల కోసం ఒక స్పెషల్ టీజర్ ని రెడీ చేయనున్నారట. జూన్ నెల లో ఈ టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది అని తెలుస్తుంది. ఇప్పటికే చిత్రీకరణ చివరి దశ లో ఉండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ ని కూడా పెంచాలని భావిస్తున్నారు. ఆగస్టు 15 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.