గుర్తు పట్టలేనంత గా మారిపోయిన రానా

రానా…. తక్కువ సమయం లో ఎక్కువ సినిమాలు చేస్తున్నప్పటికీ ఒక్కో సినిమా కి ఒక్కో లుక్ మైంటైన్ చేస్తూ, దానిని అందరూ మెచ్చేలా చేస్తున్నాడు.

తాజాగా రానా ఫొటో ఒకటి సోషల్ మీడియా లో ప్రస్తుతం హల్ చల్ చేస్తుంది. ఈ ఫొటో లో రానా మళ్ళీ కాస్త బాడీ పెంచి, గడ్డం గుబురుగా ఉంచి అసలు గుర్తు పట్టలేనంత గా తయారయ్యాడు. బాహుబలి కోసం బాడీ బాగా పెంచి….  ఎన్టీఆర్ బయోపిక్ కోసం తగ్గి… ఇప్పుడు చివరికి మళ్ళీ ఒక షేప్ కి తీసుకొస్తున్నాడు తన బాడీ ని రానా.

అయితే ఈ ఫొటో ‘హాథీ మేరె సాతి’ సినిమా సెట్స్ నుండి లీక్ అయినట్లు సమాచారం. ఇందులో రానా మావటివాడి గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభు సాల్మన్ దర్శకత్వం లో ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల అవుతుంది.