ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో కృతిసనన్

తెలుగులో ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నాగచైతన్య హీరోగా ‘దోచేయ్’ సినిమాలో కూడా కనిపించింది. కానీ ఆమెకు పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో మళ్లీ బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయింది.

ఈ భామ ఈ మధ్యనే ‘బరేలి కి బర్ఫీ’, ‘లుకా చుప్పి’ వంటి సినిమాలతో మంచి విజయాలను సాధించింది.

తాజాగా కృతిసనన్ ఒక ఆసక్తికరమైన ప్రాజెక్టును సైన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దినేష్ విజన్ నిర్మాణంలో మరొక సినిమా చేసేందుకు సిద్ధమైంది కృతి. అయితే ఈ సినిమా మొత్తం సరోగసి కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుందట. స్క్రిప్ట్ వినగానే కథ మాత్రమే కాక తన పాత్ర కూడా బాగా నచ్చడంతో ఈ సినిమా కు వెంటనే ఓకే చెప్పేసింది కృతి. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో బయటకు రానున్నాయి.

ఇదిలా ఉండగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కరీనాకపూర్ కలిసి నటిస్తున్న ‘గుడ్ న్యూస్’ సినిమా కూడా సరోగసీ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. కైరా అద్వానీ కూడా ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తోంది.