ఇబ్బందుల్లో కిచ్చా సుదీప్…. నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ

కన్నడ సినిమా పరిశ్రమ లో మంచి నటుడిగా పేరు సంపాదించిన కిచ్చా సుదీప్…. తెలుగు లో పరిచయం ఉన్న నటుడు. ఈగ సినిమా లో విలన్ గా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ నటుడు ఆ తర్వాత బాహుబలి చిత్రం లో ఒక చిన్న పాత్రని పోషించారు.

ప్రస్తుతం సుదీప్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి లో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే సుదీప్ తాజాగా కొన్ని లీగల్ ట్రబుల్స్ లో చిక్కుకున్నాడు.

గతం లో ఆయన ఒక టీవీ షో చేయగా, దాని షూటింగ్ ని చిక్మంగళూర్ దగ్గర ఒక కాఫీ ప్లాంటేషన్ లో జరిపారు. ఆ కాఫీ ప్లాంటేషన్ యజమాని దీపక్ పటేల్ కి కోటి ఎనభై లక్షల అద్దె ని చెల్లించడానికి ఒప్పుకున్నా సుదీప్ కేవలం యాభై వేలు అడ్వాన్స్ మాత్రమే ఇఛ్చి మిగిలిన డబ్బులు ఎగ్గొట్టాడని దీపక్ పోలీసులని అప్రోచ్ కాగా…. వారు కోర్టు లో పిటీషన్ ఫైల్ చేయమని సలహా ఇచ్చారు.

పోలీసుల సలహా తో ఈ విషయాన్ని వివరిస్తూ, అలాగే సుదీప్ తన ప్రాపర్టీ ని డామేజ్ చేసాడని, ఒప్పందానికి విరుధ్ధంగా ఒక సెట్ కూడా నిర్మించాడని పిటీషన్ ఫైల్ చేయగా కోర్టు సుదీప్ ని విచారణ నిమిత్తం హాజరు కామని ఆదేశించగా, అనేకసార్లు గైర్హాజరయ్యాడు సుదీప్. కోర్టు ఆగ్రహించి మే 22 లోపు సుదీప్ ను అరెస్ట్ చేసి కోర్టు లో ప్రవేశపెట్టాలని కర్ణాటక పోలీసులని ఆదేశించింది.