భోజనం పెడితే బలుపెక్కుతారనే భావన పరిటాల సునీతది

ప్రజలకు గంజి మాత్రమే పోయాలి.. భోజనం పెడితే బలుపెక్కుతారని భావించే పెత్తన దారి పోకడలతో మంత్రి పరిటాల సునీత పనిచేస్తున్నారని వైసీపీ రాప్తాడు అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.

పరిటాల కుటుంబం ఏలుబడిలో నియోజకవర్గంలోని గ్రామాలు దశాబ్దాల క్రితం ఎలాగా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయన్నారు. మంచి నీరు కూడా ఇవ్వలేని స్థితిలో మంత్రి ఉన్నారన్నారు.

కేవలం గాలి మరల కోసం ఎస్సీ, బీసీల భూములు ఇప్పించి… గాలి మరల కంపెనీ వారు ఎకరాకు 15 లక్షలు ఇస్తే… కేవలం మూడు లక్షలు మాత్రమే భూముల యజమానులకు ఇచ్చి మిగిలిన 12 లక్షలను కాజేసిన వ్యక్తి పరిటాల సునీత అని ప్రకాశ్ రెడ్డి వివరించారు.