జగన్‌ హోదా కోసం పోరాడుతుంటే అడ్డుకున్నా- చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజాలను ఆయనే బయటపెడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం జగన్‌ మోహన్ రెడ్డి పోరాటం చేసింది నిజమేనని అంగీకరించారు.

గతంలో విశాఖలో పెట్టుబడుల సదస్సు పెడితే జల్లికట్టు స్పూర్తితో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారని చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలో చెప్పారు. ఆ సమయంలో తాను గట్టిగా వ్యవహరించి హోదా ఉద్యమాన్ని అడ్డుకున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

గతంలో జగన్ ప్రత్యేక హోదా కోసం విశాఖ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఆయన్ను ఎయిర్‌పోర్టులోనే నిర్బంధించింది. ఇప్పుడు చంద్రబాబే స్వయంగా తాము హోదా ఉద్యమాన్ని గట్టిగా అడ్డుకున్నానని కర్నూలు సభలో చెప్పడం ఆసక్తికరంగా ఉంది.