ఒక్క ఏడాదిలో నాలుగు సినిమాలు…. స్పీడ్ పెంచిన నాగచైతన్య…..

సినిమాలు ఫ్లాప్ అవుతున్నా తన స్పీడ్ మాత్రం తగ్గించలేదు నాగచైతన్య. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఇంకాస్త స్పీడ్ పెంచాడు. అవును.. వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు ఈ అక్కినేని హీరో. అన్నీ కుదిరితే ఈ ఏడాది 4 సినిమాలు రిలీజ్ చేయాలనేది ఈ హీరో ప్లాన్.

ప్రస్తుతం మజిలీ సినిమా చేస్తున్నాడు చైతూ. ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు. ఇక ఈనెల 22 నుంచి వెంకీ మామ సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు. సమ్మర్ తర్వాత ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేస్తుంది.

ఈ రెండు సినిమాలతో పాటు దిల్ రాజు బ్యానర్ లో కొత్త దర్శకుడితో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు చైతూ. ఆ మూవీతో పాటు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరో యాక్షన్ మూవీ చేయాలని డిసైడ్ అయ్యాడు. మజిలీ, వెంకీమామ సినిమాలతో పాటు ఈ రెండు సినిమాల్ని కూడా ఇదే ఏడాదిలో విడుదల చేయాలనేది చైతూ ప్లాన్. ఈ హీరో ఎందుకింత ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్నాడో ఎవరికీ అర్థంకావడం లేదు.