నానికి విలన్ గా మారిన సిద్దార్థ్

“జెర్సీ” సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న నాని మరోవైపు విక్రం కే కుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా పనుల్లో కూడా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ ఉన్నారని అనౌన్స్ చేసి షాక్ ఇచ్చిన విక్రం కే కుమార్, ఇప్పుడు ఈ సినిమా కోసం విలన్ గా ఒక ఫేడ్ ఔట్ అయిన హీరోని సెట్ చేసాడట.

ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు సిద్దార్థ్. సిద్దార్థ్ తెలుగులో సినిమాలు చెయ్యడం మానేసి చాలా కాలం అవుతుంది. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ హీరోగా నటించిన “బాద్ షా” సినిమాలో ముఖ్యపాత్రలో నటించాడు. ఆ తరువాత సిద్దార్థ్ కేవలం తమిళ్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నాడు.

ఇదిగో ఇప్పుడు మళ్ళీ నాని సినిమా ద్వారా విలన్ అవతారం ఎత్తడానికి రెడీ అయ్యాడట సిద్దార్థ్. ఈ విషయం పై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో ఇప్పటికే కీర్తి సురేష్, మేఘ ఆకాష్, ప్రియ వారియర్ హీరోయిన్స్  గా ఫిక్స్ అయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని దాదాపు భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేయనున్నారు.