రానా సినిమా బెల్లంకొండ చేతికి….

సినిమాలు చేతులు మారడం వెరీ కామన్. తీరా ఆ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత బాధపడడం కూడా అంతే కామన్. ఇప్పుడు కూడా ఓ సినిమా ఇలానే చేతులు మారింది. దాని పేరు టైగర్ నాగేశ్వరరావు. మొన్నటివరకు రానా చేస్తాడనుకున్న ఈ సినిమా ఇప్పుడు బెల్లంకొండ చేతికి మారింది.

కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాతో పేరు తెచ్చుకున్న వంశీకృష్ణ ఆకెళ్ల.. ఈ టైగర్ నాగేశ్వరరావు కథ రాసుకున్నాడు. నిజానికి ఇది కథ కాదు. యదార్థ గాధ. స్టూవర్టుపురం ప్రాంతంలో ఉన్న ఓ దొంగ జీవితం ఆధారంగా రాసుకున్న స్టోరీ ఇది. అప్పట్లో దొంగల్లో హీరోగా చలామణి అయ్యేవాడట నాగేశ్వరరావు. పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టేవాడట. అదే ఈ కథ.

ఆ కథ అనీల్ సుంకర వద్ద లాక్ అయింది. కానీ సురేష్ ప్రొడక్షన్స్ కు, అనీల్ సుంకరకు మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ కారణంగా ఈ సినిమా బెల్లంకొండ కాంపౌండ్ కు వెళ్లిపోయింది. ప్రస్తుతం ‘సీత’ సినిమా చేస్తున్న ఈ హీరో, త్వరలోనే రాట్ససన్ అనే తమిళ సినిమా రీమేక్ చేయబోతున్నాడు. ఆ మూవీ తర్వాత టైగర్ నాగేశ్వరరావు సినిమా ఉంటుంది.