నడిరోడ్డుపై కుమ్మేసుకున్న అమ్మాయిలు

ఉత్తరప్రదేశ్‌లో అమ్మాయిలు రెచ్చిపోయారు. నడి రోడ్డుపైనే కొట్టుకున్నారు. అది కూడా జుట్లు… జుట్లు పట్టుకుని కాదు… ఏకంగా హాకీ స్టిక్స్‌, బెల్ట్‌లతో కొట్టుకున్నారు. ముజఫర్‌ నగర్‌లోని మహావీర్‌ చౌక్‌ వద్ద ఈ ఘర్షణ జరిగింది.

బైకులపై వచ్చిన రెండు గ్రూపుల అమ్మాయిలు… వచ్చి రాగానే ఒకరిపై ఒకరు స్టిక్‌లు, బెల్ట్‌లతో దాడి చేసుకున్నారు. ఘర్షణలో ఇరు వర్గాల అమ్మాయిలకు శరీరంపై వాతలు తేలాయి.

స్థానికులు వచ్చి అడ్డుకోబోగా.. వారికీ నాలుగు బెల్ట్‌ దెబ్బలు తగిలించి బెదరగొట్టారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

వారు వచ్చి వెంటనే అమ్మాయిలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అమ్మాయిల భీకర పోరాట దృశ్యాలు సీసీ కెమెరాల్లోనూ రికార్డు అయ్యాయి. ఈ ఘర్షణ వల్ల అర గంట పాటు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

ఈ సమయంలో పలువురు వాహనదారులు ఈ దృశ్యాలను మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.