మరో కొత్త సినిమా అనౌన్స్ చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్

ఫ్లాప్స్ తో సంభందం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇటీవలే “కవచం” సినిమాతో ఫ్లాప్ ని అందుకున్న ఈ హీరో ఇప్పుడు తన పుట్టిన రోజు సంధర్బంగా కొత్త సినిమాని అనౌన్స్ చేసాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు బెల్లంకొండ.

రమేష్ వర్మ స్టార్ డైరెక్టర్ కాదు అప్పుడెప్పుడో రవితేజతో “వీర” అనే సినిమా మాత్రమే చేసాడు. ఈమధ్య కాలంలో సినిమాలు కూడా చేయలేదు. కానీ అతనికి దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు బెల్లంకొండ. రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటించాడు.  ఇప్పటివరకు తెలుగు తెరపై ఏ హీరో అటువంటి పాత్రలో చేయలేదని, అందుకే రమేష్ వర్మ దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్నానని అప్పట్లో చెప్పాడు శ్రీనివాస్. ఆ సినిమానే ఇప్పుడు పుట్టిన రోజు సంధర్బంగా అధికారికంగా ప్రకటించారు మూవీ యూనిట్.

ప్రస్తుతం తేజ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా ఓ సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ. ఈ సినిమా షూటింగ్ అయిపోగానే రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేస్తాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.