భార్యపై కోపాన్ని పసికందుపై చూపిన తండ్రి….

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. భార్యతో గొడవ పడి ఆ కోపాన్ని కన్న కూతురిపై చూపించాడో తండ్రి. భార్యపై కోపంతో ఎనిమిది నెలల చిన్నారిని రెండంతస్తుల భవనం నుంచి కిందకు పడేశాడు.

నాచారంలో ఈ ఘటన జరిగింది. పాపకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్రకు చెందిన మనోజ్ దంపతులు నాచారంలోని మల్లాపూర్‌ లో నివాసం ఉంటున్నారు.

వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. మనోజ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భవనంపై నుంచి తండ్రి కిందకు విసిరేయడంతో పాప గట్టిగా ఏడ్చింది. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి పాపను ఆస్పత్రికి తరలించారు.

పాప పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మనోజ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.