శర్వానంద్ సినిమాకు ఆ టైటిల్ పెట్టడం లేదట!

సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు శర్వానంద్. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఇది తెరకెక్కుతోంది. కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు 50శాతం షూటింగ్ పూర్తిచేసి, పడి పడి లేచె మనసు సినిమా కోసం గ్యాప్ తీసుకున్నాడు శర్వానంద్. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించి, సింగిల్ షెడ్యూల్ లో పూర్తిచేయబోతున్నాడు.
ఇదిలా ఉండగా ఈ సినిమాకు సరైన టైటిల్ దొరకడం లేదు. శర్వానంద్ ఇందులో గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు. అది కూడా రెండు షేడ్స్ లో ఉంటుంది. దీంతో మంచి టైటిల్ సెట్ అవ్వలేదు. ఇంతలో ఈ టైటిల్ పై పుకార్లు పుట్టాయి. ఈ సినిమాకు ఏకంగా దళపతి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు కథనాలు పుట్టుకొచ్చాయి.
అయితే ఈ టైటిల్ ను యూనిట్ ఫిక్స్ చేయలేదు. మరీ బరువైన టైటిల్ అయిపోతుందని, పైగా కాస్త ఓల్డ్ లుక్ లో ఉందని పక్కనపెట్టేశారు. తమ సినిమాకు దళపతి అనే టైటిల్ ఫిక్స్ చేయలేదంటూ యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. త్వరలోనే ఓ టైటిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని ప్రకటించింది. సుధీర్ వర్మ సినిమాను ఫిబ్రవరి చివర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ ఆ టైమ్ కు సినిమా రాకపోవచ్చంటూ గాసిప్స్ వస్తున్నాయి.