సహోద్యోగినితో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన టీసీఎస్‌ టీం లీడర్‌…. ఉతికేసిన భార్య….

హైదరాబాద్‌లో ఒక వివాహేతర సంబంధం గుట్టురట్టైంది. ఒక సాప్ట్‌వేర్ ఇంజనీర్ తన సహోద్యోగినితో కాపురం పెట్టి రెడ్‌ హ్యాడెండ్‌గా దొరికిపోయాడు.

నకిరేకల్‌కు చెందిన నాగరాజు ప్రస్తుతం హైదరాబాద్‌ టీసీఎస్‌ కంపెనీలో టీం లీడర్‌గా పనిచేస్తున్నాడు. 2007లొ అమూల్యతో వివాహం జరిగింది. వారికి ఏడేళ్ల పాప కూడా ఉంది. అయితే ఆరు నెలలుగా నాగరాజు తన టీంలో పనిచేసే రాధారాణి అనే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

కొన్ని నెలల క్రితం ఇంట్లోనే రెడ్‌ హ్యాండెడ్‌గా భార్యకు ప్రియురాలితో పట్టుబడ్డాడు. దీంతో షాక్‌ అయిన భార్య… తనకు అన్యాయం చేయవద్దని బతిమలాడుకుంది. జరిగిందేదో జరిగిపోయింది ఇకపైనైనా పద్దతిగా ఉండాలని కోరింది.

కానీ నాగరాజు మరింత రెచ్చిపోయాడు. కొన్ని నెలలుగా భార్య, పాపను వదిలేసి ప్రియురాలితో మరోచోట అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు.

ఈ విషయం తెలుసుకున్న భార్య అమూల్య, బంధువులతో కలిసి వెళ్లి నాగరాజు, రాధారాణి కలిసి ఉన్న సమయంలో పట్టుకుంది. బంధువులు నాగరాజును, రాధారాణిని చితక్కొట్టారు. అనంతరం పోలీసులకు పట్టించారు. తనను కొట్టినా పర్లేదు గానీ… రాధారాణిని మాత్రం కొట్టవద్దంటూ నాగరాజు అడ్డునిలబడ్డాడు. నాగరాజును, రాధారాణిని మీర్‌పేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.