స్పై గా నటిస్తున్న గోపిచంద్

యాక్షన్ హీరో గోపిచంద్ వరుస ప్లాప్ లతో సతమతమవుతున్నాడు. ఈ ఏడాది గోపిచంద్ హీరోగా వచ్చిన “పంతం” సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టింది.

ఇక ఈ ప్లాప్ తరువాత చాలా జాగ్రత్తగా కథలు విని ఇటీవలే ఒక సినిమా స్టార్ట్ చేసాడు గోపిచంద్. తమిళ  మాస్ డైరెక్టర్ అయిన తిరు ఈ సినిమాని డైరెక్ చేయనున్నాడు. అయితే ఈ సినిమాలో గోపిచంద్ స్పై గా నటించనున్నాడు. దర్శకుడు తిరు ఈ సినిమాని పూర్తి స్థాయి స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు.

ఇకపోతే తెలుగు లో మొట్ట మొదటి మోడ్రన్ స్పై థ్రిల్లర్ గా వచ్చిన “స్పైడర్” భారీ ప్లాప్ గా నిలిచింది. కానీ ఆగస్ట్ లో రిలీజ్ అయిన “గూఢచారి” మాత్రం సూపర్ హిట్ గా నిలిచి ఇప్పుడు సిక్వెల్ కి రెడి అవుతుంది.

మరి గోపిచంద్ నటిస్తున్న ఈ సరికొత్త స్పై థ్రిల్లర్ “గూఢచారి” తరహాలో హిట్ అవుతుందో లేకపోతే “స్పైడర్’ తరహాలో ప్లాప్ అవుతుందో చూడాలి.

అనిల్  సుంకర ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా లో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇది వరకు వీళ్ళిద్దరూ కలిసి “జిల్” “ఆక్సీజన్” సినిమాలో కలిసి నటించారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది.