లేటు వయస్సులో పెళ్లి చేసుకోబోతున్న పుతిన్ !

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే పెళ్ళాడనున్నారు. పుతిన్ ఎవర్ని పెళ్లాడబోతున్నారనే విషయం ఇంకా తెలియలేదు. 66ఏళ్ల పుతిన్ 1983లో ల్యూడ్మిలాన్ ను వివాహం చేసుకున్నారు.

కొన్నెళ్లపాటు కలిసి ఉన్నారు. 2013లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే విడాకులు తీసుకున్నప్పటికి…పుతిన్ వ్యక్తిగత జీవితంపై ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి…ఇప్పటికీ చేస్తున్నాయి. అయితే వీటన్నింటిపై పుతిన్ ఏనాడూ స్పందించలేదు.

ఒలింపిక్ మాజీ జిమ్నాస్ట్ అలీనా కబేవాతో పుతిన్ సన్నిహితంగా ఉంటున్నట్లు అప్పట్లో ఓ రష్యన్ పత్రిక ప్రచురించింది. ఈ వార్తను పుతిన్ ఖండించారు.

అయితే తాజాగా గురువారం నిర్వహించిన వార్షిక మీడియా సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు పుతిన్ స్పందించారు. తాను తర్వలోనే పెళ్లి చేసుకోనున్నట్లు చెప్పారు. దీంతో ఇప్పుడు పుతిన్ పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారింది. కానీ తాను ఎవర్ని పెళ్లి చేసుకోబోతున్నది మాత్రం చెప్పేందుకు పుతిన్ నిరాకరించారు.